♪♫
TG-4181
Telugu
రారే రారే ఓ జనులారా
Raare Raare O Janulaaraa
0
views
పల్లవి
రారే రారే ఓ జనులారా వేగమే రారండోయ్ సక్కనైన బాల యేసుని చూతము రారండోయ్ (2) పాపాలు బాపునంట – రోగాలు తీర్చునంట లోకాన పండగంట (2) ||రారే||
1వ చరణం
మనుషుల పాపము బాప మహిమనే వీడాడంట మనిషిగా పుట్టేటందుకు ధరణికి వచ్చాడోయ్ (2) మహిమ రాజ్యము నాడు మనకీయ పుట్టెనులే మహిమా స్వరూపుడు మరణానికి తల ఒగ్గాడోయ్ (2) ||రారే||
2వ చరణం
రాజుల రాజుగ యేసు రాజ్యమే మనకీయగను పాపపు దాస్యము నుండి విడుదల నిచ్చుటకు (2) పాప భారము మోసి మరణ కోరలు విరచి శాశ్వత జీవమునివ్వగ మరణము గెలిచాడోయ్ (2) ||రారే||