♪♫
TG-5604
Telugu
మెరిసేటి తారలా నను వెలిగించు కురిసేటి జల్లులా నను దీవించు
Meriseeti Thaaralaa Nanu Veliginchu Kuriseeti Jallulaa Nanu Deevinchu
0
views
పల్లవి
మెరిసేటి తారలా నను వెలిగించు కురిసేటి జల్లులా నను దీవించు నా ఊపిరివై నా జీవితమై నా ఊపిరివై నా జీవితమై నా ప్రాణ స్నేహమై నా రక్షకుడై నీ కనులే నా మనసే తేరిచూడగా నాలోనా ఏ మంచి కానరాదుగా నీ కృపలో నా గతమే చూడలేదుగా సరిచేసి నడిపించు నీదు సాక్షిగా నీతి సూర్యుడా నాదు యేసయ్య జీవితాంతము జాలి చూపవా నా ప్రాణ స్నేహమై - నా రక్షకుడై నీ మమతే తీయనిదీ మారదెన్నడు లాలించే నీ ప్రేమ వీడదెన్నడు ఊహలకే అందనిది నీదు కార్యము నీ మాటే నాలోన నిండు ధైర్యము సర్వశక్తుడా నాదు యేసయ్య ఆశ్రయించగా ఆదరించవా నా ప్రాణ స్నేహమై - నా రక్షకుడై