మేలు చేయాలని దీవించాలని నీ కృపలోనే దాచాలని
Meelu Cheeyaalani Deevinchaalani Nee Krupaloonee Daachaalani
మేలు చేయాలని దీవించాలని - నీ కృపలోనే దాచాలని ఊహించని కార్యములు నాలో జరగాలని - సమృద్ధితో నింపాలని (2) ఆశయ్యా నీ ఆశయ్యా ఘనపరచువాడవు కృపచూపువాడవు - పడిపోయిన స్థితినుండి పైకిలేపు దేవుడవు (2) నీ రక్షణ కంచెఉంటే - నన్ను తాకేదెవరయ్యా నీవే నన్ను కోరుకుంటే - నన్ను దాటేదెవరయ్యా కడవరకు నా సాక్ష్యమును - కాపాడుకొందునయ్యా ||మేలు చేయాలని||
నా ఒంటరి పయనంలో - నీ దూతల తోడుంచావు నేవేయు ప్రతి అడుగులో - నా ముందర నీవున్నావు (2) నీ కంచెలేకుండా - తిరిగిరాలేనయ్యా (2) నా రక్షణశృంగమా నీవు లేనిదే - నే బ్రతుకగలనా ||మేలు చేయాలని||
ప్రాణమున్నంతవరకు - పరవశించి నే పాడెదా నీ కృపలను తలపోయుచు - నిన్ను ఆరాధించెదా (2) ఓపిక ఉన్నంతవరకు - కాదయ్యా నీ సేవ (2) నాలో ఊపిరి ఉన్నంతవరకు - చేయాలయ్యా నీ సేవ ||మేలు చేయాలని||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.