♪♫
TG-1327
Telugu
ఆశలన్నీ నీ మీదనే నా ఆశలన్నీ నీ మీదనే
aashalannee nee meedanee naa aashalannee nee meedanee
200
views
పల్లవి
ఆశలన్నీ నీ మీదనే నా ఆశలన్నీ నీ మీదనే నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని చెదరిన మనస్సు నలిగిన హృదయం ఎండిన ఎముకై నేనుంటిని
1వ చరణం
పక్షిరాజు యవ్వనం వలె నూతన పరచుమా అలయక సొలయక పరుగెత్తెద సేవలో నీ కొరకై ఆశ కలిగినట్టివారు ధన్యులు గుప్పిలి విప్పి నా కోరిక తీర్చుమా ||ఆశలన్నీ||
2వ చరణం
వెలుగునిచ్చు జ్యోతినై ఉండాలని లోకమునకు ఉప్పునై బ్రతకాలని రోగులకే ఔషదం అవ్వాలని జీవజలపు నదిగ నేను ప్రవహించాలని ||ఆశలన్నీ||
3వ చరణం
మండుచున్న సంఘములను ప్రభుకొరకై కట్టెద కోట్లాది ఆత్మలను సిలువ చెంత చేర్చెద దిక్కులేని వారికి ఆదరణగ నుండెద కడవరకు నీ ప్రేమను లోకమంత చాటెద ||ఆశలన్నీ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.