TG-1323
Telugu

స్తుతులకు పాత్రుడా స్తుతించుచున్నాను నజరేయుడా

sthuthulaku paathrudaa sthuthinchuchunnaanu najareeyudaa

203
views
పల్లవి

స్తుతులకు పాత్రుడా స్తుతించుచున్నాను నజరేయుడా నా హృదిలో నీ సన్నిధిలో మరువక విడువక స్తుతించుచున్నాను

1వ చరణం

సాగిల పడితిని నీ సన్నిధిలో ఘనుడా నీ కొరకు నీవు నాకై చేసిన మేలుల కొరకై ||స్తుతులకు||

2వ చరణం

నీ సన్నిధిలో నిలచితి నేను నీ సాక్షిగా నీవు పిలచిన పిలుపును ప్రచురము చేయ నిలచితి సాక్షిగా ||స్తుతులకు||

3వ చరణం

పాడుచుంటిని నీ సన్నిధిలో ఆత్మతో సత్యముతో నేను ఆడుచుంటిని ఆనందముతో గంతులు వేయుచు ||స్తుతులకు||

4వ చరణం

భజనలు చేసెద నీ సన్నిధిలో ఘనుడా నీ కొరకు భజయింతును భజయింతును ఘనుడా నీ కొరకు ||స్తుతులకు||