TG-1328
Telugu

అవే మాకున్నవి అవే మాకున్నవి

avee maakunnavi avee maakunnavi

202
views
పల్లవి

అవే మాకున్నవి అవే మాకున్నవి వినగల చెవులు కనగల కనులు నీ కృప చాటే స్తుతి గీతములు విరిగి నలిగిన హృదయము నుండి వలచిన కన్నీరు

1వ చరణం

ఇచ్చినవన్నీ నీవే దేవా ఉన్నవన్నియు నీ ఈవులు దేవా ఈనాటి దినము నీ దానము దేవా నాదు జీవము నాకున్న స్వరము నీ కృప దేవా ఎంచిచూడయ తెంచిచూడగ నా వన్నీ నీవే దేవా ||అవే||

2వ చరణం

ఎడ్లకు బదులు మాదు పెదవులు స్తుతి యాగముగ సిద్ధము దేవా ఎమివ్వగలను నీ సన్నిధిలోన ఏ తైలములను బలిపశువలను నీ ముందుకు తేనా ఎంచిచూడయ తెంచిచూడగ నా వన్నీ నీవే దేవా ||అవే||

3వ చరణం

మరణము నుండి మాలిన్యము నుండి పాపము నుండి పలు భయముల నుండి విడిపించితివి నను నడిపించితివి పాపపు చెర సంకెళ్ళను తెంచి కరుణించితివి ఎంచిచూడయ తెంచిచూడగ నా వన్నీ నీవే దేవా ||అవే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.