TG-4262
Telugu

శ్రమలందు నీవు

Shramalandu Neevu

0
views
పల్లవి

శ్రమలందు నీవు నలిగే సమయమున ప్రభు నీకు తోడుండునని యోచించలేదా? గమనించలేదా? ఇమ్మానుయేలుండునని ||శ్రమలందు||

1వ చరణం

శ్రమలందు ఏలియాకు కాకోలముచేత ఆహారము పంపించ లేదా? (2) ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుట లేదా? (2) ||శ్రమలందు||

2వ చరణం

శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమీయలేదా? (2) ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి పరలోక రాజ్యమీయలేదా? (2) ||శ్రమలందు||