♪♫
TG-5703
Telugu
లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ
Lekkaleeni Chukkalennoo Chakkagaa Veluguchunda
0
views
పల్లవి
లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ (2) చెప్పకుండ వెళ్ళిపోయె చక్కని చుక్క దుఃఖమే విడిచిపోయె చక్కని చుక్క (2) ||లెక్కలేని||
1వ చరణం
1. ప్రభువునందు మృతులే మరి ధన్యులని విభుని చెంత చేరుటయే గమ్యమని (2) ఆలకించెనెక్కడో చక్కని చుక్క ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క (2) ||లెక్కలేని||
2వ చరణం
2. దేహమందు నివశించుట వ్యర్ధమని మోహమంత మరచుట పరమార్ధమని (2) ఆలకించెనెక్కడో చక్కని చుక్క ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క (2) ||లెక్కలేని||
3వ చరణం
3. పాపలోకమందు బ్రతుకలేమని ఆ పరమును చే్రుటయే మేలని (2) ఆలకించెనెక్కడో చక్కని చుక్క ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క (2) ||లెక్కలేని||
4వ చరణం
4. యేసు ప్రభువు తిరిగి భువికి వచ్చునని మృతులనుండి తనను తిరిగి లేపునని(2) ఆలకించెనెక్కడో చక్కని చుక్క ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క (2) ||లెక్కలేని||