TG-5704
Telugu

లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (212)

Lekkinchaleeni Sthoothramul Deevaa Ellappudoo Nee Paadedan (212)

17
views
పల్లవి

లెక్కించలేని స్తోత్రముల్ - దేవ ఎల్లప్పుడు నేపాడేదన్ ఇంతవరకు నా బ్రతుకులో - నీవు చేసిన మేళ్ళకై 1.  ఆకాశ మహాకాశముల్ - దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ - ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించ||

1వ చరణం

2.  అడవిలో నివసించునవన్నీ - సుడిగాలియు మంచును భూమిపై నున్న వన్నీ - దేవా నిన్నే పొగడును ||లెక్కించ||

2వ చరణం

3.  నీటిలో నివసించు ప్రాణుల్ - ఈ భువిలోని జీవరాసులు ఆకాశమున ఎగురునవన్నీ - ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.