TG-5787
Telugu

స్తోత్రార్పణ నర్పింతము జప ధూపము వేసి కీర్తింతము

Sthoothraarpana Narpinthamu Japa Dhoopamu Veesi Keerthinthamu

0
views
పల్లవి

స్తోత్రార్పణ నర్పింతము జప ధూపము వేసి కీర్తింతము పాత్రుం డైన శ్రీ యేసుఁడు పరమ భోజనాంశమైనందున ||స్తోత్రార్పణ||

1వ చరణం

1.  కృతజ్ఞతా స్తోత్రంబులన్ దేవ కృపార్థంబై చేయుదము క్షీతి నాతండు బలి నియ్యఁగాఁ పుట్టె నూతనంపు నిబంధన ||స్తోత్రార్పణ||

2వ చరణం

2.  పాపము లన్ని హరించెను మా ప్రభు వగు యేసు సురక్తము ఏపుగ దీనిఁ దలంచుచు నిఁక నెన్నఁడు యేసుని భజింతము ||స్తోత్రార్పణ||

3వ చరణం

3.  చావు నుండి రక్షించెను స జీవులలో లెక్కించెను దేవుని కిఁక నర్పింతము స జీవార్పణ బలిగను ||స్తోత్రార్పణ||

4వ చరణం

4.  పుణ్యరక్త శరీరముల లోఁ పాలొందు మన మందరము అన్యులము కానేరము దై వాన్యోన్యంబు నొందినాము ||స్తోత్రార్పణ||

5వ చరణం

5.  మరణ శ్రమల స్మరింతము ప్రభు తిరిగి వచ్చు పర్యంతము ధర నా యేసు మరణంబును యింకఁ చిరకాలంబుఁ జాటింతము ||స్తోత్రార్పణ||