♪♫
TG-3160
Telugu
బంధము నీవే
Bandhamu Neeve
0
views
పల్లవి
బంధము నీవే – స్నేహము నీవే (2) (యేసయ్యా) అతిథివి నీవేనయ్యా ఆప్తుడా నీవేనయ్యా (2) ప్రేమించువాడా కృప చూపువాడా నాతోనే ఉండి నను నడుపువాడా (2) కాలాలు మారినా మారని వాడా (2) విడువవు నను ఎప్పుడూ మరువని తండ్రివయ్యా (2) ||బంధము||
1వ చరణం
మూగబోయిన నా గొంతులోన గానము నీవై నను చేరినావా (2) హృదయ వీనవై మధుర గానమై (2) నాలోనే ఉన్నావయ్యా నా ఊపిరి నీవేనయ్యా (2) ||బంధము||
2వ చరణం
ఈ లోకములో యాత్రికుడను ఎవ్వరు లేని ఒంటరినయ్యా (2) నీవే నాకు సర్వము దేవా (2) చాలును చాలునయ్యా నీ సన్నిధి చాలునయ్యా (2) ||బంధము||