TG-3158
Telugu

బలమైనవాడా

Balamainavaadaa

0
views
పల్లవి

బలమైనవాడా బలపర్చువాడా మరలా నన్ను దర్శించుమా స్తోత్రం స్తోత్రం (2) స్తోత్రం నీకేనయ్యా హల్లెలూయా హల్లెలూయా (2) హల్లెలూయా నీకేనయ్యా ||బలమైన||

1వ చరణం

ఎండిపోతిని దిగజారిపోతిని నీ కొరకే నేను బ్రతకాలని మరలా నన్ను దర్శించుము (2) మొదటి ప్రేమ మొదటి పవిత్రత మరలా నాలోన దయచేయుమా (2) ||బలమైన||

2వ చరణం

అల్పుడనైతిని అభిషేకం కోల్పోతిని నీలోన నేను ఉండాలని మరలా నన్ను వెలిగించుము (2) మొదటి తీవ్రత మొదటి శక్తి సర్వదా నాపై కురిపించుమా (2) ||బలమైన||