♪♫
TG-3159
Telugu
బలపరచుము స్థిరపరచుము
Balaparachumu Sthiraparachumu
20
views
పల్లవి
బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయము (2) లోకాశల వైపు చూడకూండా లోకస్థులకు జడవకుండా (2) నీ కృపలో నేను జీవించుటకు ||బలపరచుము||
1వ చరణం
నా మాటలలో నా పాటలలో నీ సువార్తను ప్రకటించెదను (2) నే నడచు దారి ఇరుకైననూ నే నిలుచు చోటు లోతైననూ (2) నే జడవక నిను కొలుతును ||బలపరచుము||
2వ చరణం
ధ్యానింతును కీర్తింతును నీ వాక్యమును అను నిత్యము (2) అపవాది నన్ను శోధించినా శ్రమలన్ని నాపై సంధించినా (2) నే జడవక నిను కొలుతును ||బలపరచుము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.