♪♫
TG-3156
Telugu
బాల యేసుని జన్మ దిన
Baala Yesuni Janma Dinam
0
views
పల్లవి
బాల యేసుని జన్మ దినం వేడుకైన శుభ దినము సేవింప రారే జనులారా ముద్దుల బాలకు ముద్దులిడ ||బాల||
1వ చరణం
మరియమ్మ ఒడిలో ఆడెడి బాలుని చిన్నారి చిరునవ్వు లొలికెడి బాలుని (2) చేకొని లాలింప రారే జో జోల పాటలు పాడి ||బాల||
2వ చరణం
పాపికి పరమ మార్గము జూప ఏతెంచి ప్రభువు నరునిగా ఇలకు (2) పశుశాలయందు పవళించే తమ ప్రేమను జూపింప మనకు ||బాల||
3వ చరణం
మన జోల పాటలు ఆలించు బాలుడు దేవాది దేవుని తనయుడు గనుక (2) వరముల నొసగి మనకు దేవుని ప్రియులుగా జేయు ||బాల||