TG-4393
Telugu

వెండి బంగారాల కన్

Vendi Bangaaraala Kanna

0
views
పల్లవి

వెండి బంగారాల కన్న మిన్న అయినది యేసు ప్రేమ – నా యేసు ప్రేమ (2) లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2) లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2) ||వెండి||

1వ చరణం

లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలిగించిన ప్రేమ (2) లోకులకై కరిగిపోయిన ప్రేమ లోకాన్ని జయించిన ప్రేమ (2) యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2) హల్లెలూయా మహదానందమే (2) ||వెండి||

2వ చరణం

ఏ స్థితికైనా చాలిన ప్రేమ నీ పరిస్థితిని మార్చగల ప్రేమ (2) నీకు బదులు మరణించిన ప్రేమ చిర జీవము నీకొసగిన ప్రేమ (2) యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2) హల్లెలూయా మహదానందమే (2) ||వెండి||