TG-409
Telugu

మా శ్రమ లన్ని తీర్చితివి

maa shrama lanni theerchithivi

201
views
పల్లవి

మా శ్రమ లన్ని తీర్చితివి మాకు విశ్రాంతి నిచ్చితివి మహిమ నీకుఁ గల్గెడును మిత్రుఁడవైన రక్షకుఁడా!

1వ చరణం

సందియ మంతఁ దీర్చితివి పూర్ణ విశ్వాస మిచ్చితివి మహిమ నీకుఁ గల్గెడును మిత్రుఁడవైన రక్షకుఁడా! ||మా శ్రమ||

2వ చరణం

కన్నీళ్లు నీవు తుడ్చితివి మాకు సంతోష మిచ్చితివి మహిమ నీకుఁ గల్గెడును మిత్రుఁడవైన రక్షకుఁడా! ||మా శ్రమ||

3వ చరణం

నీ చరణంబు నమ్మితిమి కరుణఁ జూపి ప్రోచితివి మహిమ నీకుఁ గల్గెడును మిత్రుఁడవైన రక్షకుఁడా! ||మా శ్రమ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.