♪♫
TG-4089
Telugu
పరుగెత్తెదా పరుగెత్తెదా
Parugetthedaa Parugetthedaa
16
views
పల్లవి
పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికై ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా||
1వ చరణం
దైవ భయము కలిగి – శరీరేఛ్చలను విడిచి (2) అక్షయ కిరీటము కొరకే – ఆశతో పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా||
2వ చరణం
ఆత్మాభిషేకము కలిగి – ఆత్మల భారముతో (2) అతిశయ కిరీటము కొరకే – అలయక పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా||
3వ చరణం
యేసు వైపు చూచుచు – విశ్వాసము కాపాడుకొనుచు (2) వాడబారని కిరీటముకే – వాంఛతో పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.