TG-4086
Telugu

పరిశుద్ధుడవై

Parishuddhudavai

0
views
పల్లవి

పరిశుద్ధుడవై – మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై – దీనుల పక్షమై కృప చూపు వాడవు (2) దయాళుడవై – ధారాళముగా నను దీవించిన శ్రీమంతుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడవై||

1వ చరణం

నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి (2) శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్ధనలు సఫలము చేసితివి ||ఆరాధన||

2వ చరణం

నీ నిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి (2) నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి ||ఆరాధన||

3వ చరణం

ఆనందకరమైన దేశములో నేను నిను ఘనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి (2) మేఘ వాహనుడవై వచ్చుఁవరకు నే కనిపెట్టుచుందును నీ కోసము నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదవు ||ఆరాధన||