TG-258
Telugu

యెహోవ పురి పునాది యిల

yehoova puri punaadi yila

205
views
పల్లవి

యెహోవ పురి పునాది యిల మహా స్థిరంబైనది

1వ చరణం

మహా సీయోను గుమ్మములు అవి యెహోవాకు నతిప్రియములు ఇఁక నిహ జను లెల్లరు గొనియాడి నిను బహు కీర్తంతురు పట్టణమా ||యెహోవ పురి||

2వ చరణం

భూమిలో సర్వజనాంగముల్ తమ నామము లచ్చట వ్రాయన్ ఆ స్వామి యెహోవా వారిన్ అట జన్మించిరి యని వ్రాయన్ ||యెహోవ పురి||

3వ చరణం

పాటలు పాడి జనాంగమా తమ యూటలు నీ కడ గలవే యని స్తుతియింతురు నిను స్తుతిపాత్రా యిఁక భజియింతురు నిను నిజభక్తిన్ ||యెహోవ పురి||

4వ చరణం

ఇది క్రైస్తవ సంఘంబే కడు శుభముల నిచ్చు స్థలంబే ధర బుధు లేసుని నిటఁ గనుచు నతి ముదమును బొందుట నిజమే ||యెహోవ పురి||

5వ చరణం

జనః కుమా రాత్మకును నిఁక ఘనమహిమలు గల్గునుగాక ఆ దిని నుండిన రీతిని నిపుడు నిఁక ననవరతముండును ఆమేన్ ||యెహోవ పురి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.