TG-4467
Telugu

యేసయ్యా నీ పూల తోట

Yesayyaa Nee Poola Thota

0
views
పల్లవి

యేసయ్యా నీ పూల తోట పుష్పించ లేదెందు చేత – (2) రకరకాల విత్తనాల ప్రేమ మీద చల్లినావు (2) మోసులెత్తినా – చిగురాకు లేచినా పూవులెందుకు పూయలేదు ఫలమెందుకు పండలేదు ||యేసయ్యా||

1వ చరణం

సంఘాల స్థాపించినావు సదుపాయములిచ్చినావు (2) సంఘమెదిగినా – సంఖ్య పెరిగినా (2) సాంగత్య ప్రశాంతి లేదు సౌరభ్యము నిండలేదు ||యేసయ్యా||

2వ చరణం

స్వార్ధ రహితుల కాపు లేదు ఆత్మ జీవికి పెంపు లేదు (2) సేవ చేసినా – సువార్త సాగినా (2) పూలెందుకు పూయలేదు (2) ఫలమెందుకు పండలేదు ||యేసయ్యా||