TG-3082
Telugu

అబ్రాహాము ఇస్సాక

Abraahaamu Issaaku

0
views
పల్లవి

అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు (యేసయ్యా) భూ రాజులందరికి భూ జనులందరికి పూజ్యుడవు – (2) ||అబ్రాహాము||

1వ చరణం

అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని ఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి (2) యాకోబును ఇశ్రాయేలని దీవించి ఈ పాపిని నీవు విడువక ప్రేమించి నా మంచి యేసయ్యా – నీవున్న చాలయ్యా నీ చేతి నీడలో జీవింతునయ్యా (2) ||అబ్రాహాము||

2వ చరణం

జీవాహారము నేనే అని పలికితివి జీవ జలముల ఓరన నను నాటితివి (2) నిర్జీవమైన నన్ను సజీవునిగా చేసి హృదయము నుండి జీవ జలములు పుట్టించి నీ జీవాహారము – నీ జీవజలమును నాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును (2) ||అబ్రాహాము||