అదిగదిగో అల్లదిగో
Adhigadhigo Alladhigo
అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో ||అదిగదిగో||
గెత్సేమను ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో (2) అచటనే యుండి ప్రార్ధించుడని (2) పలికిన క్రీస్తు మాటదిగో (2) ||అదిగదిగో||
శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు (2) ప్రభువును యూదులకప్పగింప (2) పెట్టిన దొంగ ముద్దదిగో (2) ||అదిగదిగో||
లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై (2) పావనుడేసుని రక్తమును గల (2) ముప్పది రూకల మూటదిగో (2) ||అదిగదిగో||
చలి కాచుకొను గుంపదిగో ఆ పేతురు బొంకిన స్థలమదిగో (2) మూడవసారి బొంకిన వెంటనే (2) కొక్కొరొకోయను కూతదిగో (2) ||అదిగదిగో||
యూదుల రాజువు నీవేనా మోదముతో నీవన్నట్లే (2) నీలో దోషము కనుగొనలేక (2) చేతులు కడిగిన పిలాతుడాడుగో (2) ||అదిగదిగో||
గొల్గొతా స్థల అద్దరిని ఆ ఇద్దరు దొంగల మధ్యమున (2) సాక్షాత్తు యెహోవా తనయుని (2) సిలువను వేసిరి చూడదిగో (2) ||అదిగదిగో||
గొల్లున ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో (2) యూదుల రాజా దిగి రమ్మనుచు (2) హేళన చేసిన మూకదిగో (2) ||అదిగదిగో||
దాహము గొనుచున్నాననుచు ప్రాణము విడిచెను పావనుడు (2) పరిశుద్ధుడు మన రక్షకుడేసు (2) మన మది యేమో గమనించు (2) ||అదిగదిగో||