♪♫
TG-3081
Telugu
ఆయనే నా సంగీతమ
Aayane Naa Sangeethamu
0
views
పల్లవి
ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము ||ఆయనే||
1వ చరణం
స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే (2) వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2) ||ఆయనే||
2వ చరణం
ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన (2) ఉండెదననిన మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2) ||ఆయనే||
3వ చరణం
సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము (2) రాకడలో ప్రభుతో నిత్యముందుము మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము (2) ||ఆయనే||