ఆలకించుమో దేవా మా ఆక్రందనను
aalakinchumoo deevaa maa aakrandananu
🎵 TG-1925🌐 Telugu
పల్లవి
ఆలకించుమో దేవా మా ఆక్రందనను కోల్పోతిమయ్యా మా ఆత్మీయులను (2) మా ధైర్యము నీవై – మము నడిపించుము తండ్రి బలహీనులమైన మమ్ము బలపరచుమయ్యా… భూదిగoతముల నుండి మొరపెట్టుచున్నాము మా ప్రార్థన ఆలకించుమో దేవా మా కనులెత్తుచున్నాము కనికరించుము నీ రాకడకు మమ్ము సిధ్ధపరచుము అంధకారము అలముకొన్న – ఈ లోకములో గొప్ప వెలుగుగా మమ్ము ఉండనిమ్ము ||ఆలకించుమో||