TG-633
Telugu

ఇదియే సమయంబు రండి యేసుని

idiyee samayanbu randi yeesuni

209
views
పల్లవి

ఇదియే సమయంబు రండి యేసుని జేరండి ఇక సమయము లేదండి రండి రక్షణ నొందండి

1వ చరణం

పాపులనందరిని తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా మరణపు ముల్లును విరిచి విజయము నిచ్చెనుగా ||ఇదియే||

2వ చరణం

రాజుల రాజైన యేసు రానై యుండేనుగా గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి తరుణముండగానే మీరు తయ్యారవ్వండి ||ఇదియే సమయంబు||

3వ చరణం

బుద్ధి లేని కన్యకలవలె మొద్దులుగానుంటె సిద్దెలలో నూనెపోసి సిద్ధపడకపోతే తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండి ||ఇదియే సమయంబు||

4వ చరణం

వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండీ మిమ్మును ఎరుగను మీరెవరో పొమ్మనును ||ఇదియే సమయంబు||

5వ చరణం

సందియ పడకండి మీరు సాకులు చెప్పకను గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి మరణ దినమూ మన మెరుగము సుమ్మండీ ||ఇదియే సమయంబు||

6వ చరణం

సందియ పడకండి మీరు సాకులు చెప్పకను గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి మరణ దినమూ మన మెరుగము సుమ్మండీ ||ఇదియే సమయంబు||

7వ చరణం

జాలము చేయకను మెరు హేళన చేయకను కులము స్థలమనుచూ మీరు కాలము గడువకనూ తరుణముండగానే మీరు త్వరపడి రారండి ||ఇదియే సమయంబు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.