TG-191
Telugu

ఎంతో వింత యెంతో చింత

entoo vinta yentoo chinta

12
views
పల్లవి · Chorus

ఎంతో వింత యెంతో చింత యేసునాధు మరణ మంత పంతము తోఁ జేసి రంత సొంత ప్రజలు స్వామి నంత ||ఎంతో వింత||

చరణం 1 · Verse 1

పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టి రేసు నాధు నకటా అట్టి శ్రమల నొంది పలుకఁ డాయె యేసు స్వామి నాఁడు ||ఎంతో వింత||

చరణం 2 · Verse 2

మొయ్యలేని మ్రాను నొకటి మోపి రేసు వీపుపైని మొయ్యలేక మ్రానితోడ మూర్ఛఁబోయె నేసు తండ్రి ||ఎంతో వింత||

చరణం 3 · Verse 3

కొయ్యపై నేసయ్యన్ బెట్టి కాలుసేతులలోఁ జీలల్ కఠిను లంత గూడి కొట్టిరి ఘోరముగఁ క్రీస్తేసున్ బట్టి ||ఎంతో వింత||

చరణం 4 · Verse 4

దాహముగొనఁ జేదు చిరకఁ ద్రావ నిడిరి ద్రోహు లకటా ధాత్రిఁ ప్రజల బాధ కోర్చి ధన్యుఁడా దివి కేగె నహహా ||ఎంతో వింత||

చరణం 5 · Verse 5

బల్లెముతోఁ బ్రక్కన్ బొడవన్ పారె నీరు రక్త మహహా ఏరై పారె యేసు రక్త మెల్ల ప్రజల కెలమి నొసఁగు ||ఎంతో వింత||