TG-2951
Telugu

పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో

paralookamee naa svaasthyamu - epudu gaantunoo

బ్రదర్ జోసెఫ్ కురియన్ · Bro. Joseph Kuriyan
5
views
Chorus

పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో నా ప్రియ యేసుని - నేనెపుడు (2)

1వ చరణం

ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట పరమ మకుటము పొందను - ప్రభు పాదముల చేరెదను

2వ చరణం

సిలువ వేయబడితిని - ఇక నేకాదు జీవించుట ప్రభు యేసు మహిమ కొరకు - గురి గలిగి జీవింతును

3వ చరణం

నా పరుగు తుదముట్టింప - నాకు కృపను మెండుగ నొసగును విశ్వాస మార్గములో - విసుగక పరుగెత్తెదను

4వ చరణం

పరమ విశ్రాంతి పొంద - పరలోకమందు చేరెదను పగలు రాత్రచ్చట లేదు - ప్రభువే దీపమై యుండును

5వ చరణం

ప్రియుని పిలుపును విని - నేను కూడా సిద్ధపడెదను దినములు సమీపించగా - వాంఛయు అధికంబాయె ||పరలోకమే||