TG-2948
Telugu

అర్హత లేకున్న ప్రేమించావు (నేనేమైయున్నానో నీ కృపయే)

arhata leekunna preeminchaavu (neeneemaiyunnaanoo nee krupayee)

Ps.Jyothi Rajuపాస్టర్ ఎం జ్యోతి రాజు · Pastor M Jyothi Rajuపాస్టర్ ఎం జ్యోతి రాజు · Pastor M Jyothi Raju
67
views
Chorus

అర్హత లేకున్న ప్రేమించావు - ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నహెచ్చించావు- ఇది కేవలం నీ కృపయే

పల్లవి పూర్వ భాగం

కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయే కృపయే కృపయే నేబ్రతికి ఉన్నానంటే కృపయే ||అర్హత||

1వ చరణం

లోకమునన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టుచేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే (2) ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటివాడను యేసయ్య (2) నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను (2) ||కృపయే||

2వ చరణం

శ్రమలు శోదనలు నన్నావరింపగా అజ్ఞానముచే నే హీనమవ్వగా మరణపు కొరలు నా చుట్టు చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే (2) ఇంతగ నన్ను ప్రేమించుటకు ఏపాటివాడను యేసయ్య (2) నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను (2) ||కృపయే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.