ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను
aaraadhanaku yoogyudaa nithyamu sthuthiyinchedanu
🎵 TG-2914🌐 Telugu
పల్లవి
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2) ఆరాధన ఆరాధన నీ మేలులకై ఆరాధన – నీ దీవెనకై ఆరాధన దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును నీ ప్రేమకై ఆరాధన – నీ జాలికై ఆరాధన ధనవంతులుగా చేయుటకు దారిద్య్రత ననుభవించినావు హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను నీ కృప కొరకై ఆరాధన – ఈ స్థితి కొరకై ఆరాధన (2) ||ఆరాధనకు||