బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు
bangaaram adugaleedu vajraalni adugaleedu
🎵 TG-2909🌐 Telugu
పల్లవి
బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు (2) మనుషులను చేసాడయ్యా ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా నా యేసయ్యా.. నా యేసయ్యా… ||బంగారం||
1వ చరణం
పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా ||నా యేసయ్యా||
2వ చరణం
రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా ధనవంతులనుగా మనలను చేయ దారిద్ర్యమొందాడయ్యా