♪♫
TG-2274
Telugu
భజియింతుము నిను జగదీశా శ్రీ
bhajiyinthumu ninu jagadeeshaa shree
63
views
పల్లవి
భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణ కర్తా (2) శరణు శరణు మా దేవా యెహోవా మహిమాన్విత చిర జీవనిధి (2) ||భజియింతుము||
1వ చరణం
విమల సెరాపులు దూత గణంబులు చూడగ లేని తేజోనిధివే మా యధములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే (2) ||శరణు||
2వ చరణం
ప్రప్రధముడ మరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి నీ భజనలు మా జీవనాధారం చేకొనవే మా స్తుతి గీతం (2) ||శరణు||