TG-461
Telugu

ఆత్మలను సంపాదింపఁ నగు ఆత్మ

aathmalanu sanpaadinpam nagu aathma

202
views
పల్లవి

ఆత్మలను సంపాదింపఁ నగు ఆత్మ బలమున నిది చేయనగు ఆత్మ సంపాదనముకన్న నక్షయానందము లేదన్న యాత్మలను వెదకి రక్షింప నాత్మల కాపరి యాన తిడి ||ఆత్మలను సంపాదింపఁ||

1వ చరణం

ధనముకన్న నాత్మ సంపా దనము మేలౌ దాని సంపా దనముఁ గోరి మన రక్షకుఁడు ధారపోసెను దన రక్తంబు ||ఆత్మలను సంపాదింపఁ||

2వ చరణం

క్షణక్షణము నెందఱో నశింప జాలిలేద నీవు సిఖింప అణఁకువతో ననుదిన మొక యాత్మ నైన రక్షింపఁగ దయ రాదా ||ఆత్మలను సంపాదింపఁ||

3వ చరణం

పరుల యాత్మ విమోచనంబు ప్రభువు కోరు బహుమానంబు పరదుఁ డౌ క్రీస్తును నీవెట్లు వట్టి చేతులతో దర్శింతు ||ఆత్మలను సంపాదింపఁ||

4వ చరణం

నీతిమార్గము ననుసరింప నిత్యమును జక్కఁగ వర్తింపఁ పాతకులఁ ద్రిప్పెడు సద్భక్తుల్ జ్యోతులట్లు బ్రకాశించెద రిఁక ||ఆత్మలను సంపాదింపఁ||

5వ చరణం

జీతనాతంబులు లేవని సిగ్గుపడకు మిది కాదని ప్రీతితో నాత్మలను గడింప నీతి మహిమ మకుటంబులునౌ ||ఆత్మలను సంపాదింపఁ||

6వ చరణం

నీ యమూల్య తరుణంబుల నీ ప్రశస్తదానంబుల వేయియేల నీ సర్వంబు విభుని సేవకు నీ వర్పించు ||ఆత్మలను సంపాదింపఁ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.