TG-4615
Telugu

ఇమ్మానుయేలు బాలుడు సొగసైన సౌందర్య పుత్రుడు

Immaanuyeelu Baaludu Sogasaina Saundarya Puthrudu

20
views
పల్లవి

ఇమ్మానుయేలు బాలుడు సొగసైన సౌందర్య పుత్రుడు (2) మహిమనే విడిచాడు మార్గమై వచ్చాడు సర్వ మానవాళి నీ రక్షింపాను (2) సర్వ మానవాళి నీ రక్షింపాను ఆ బాలుడు యేసు బాలుడు సర్వలోకానికి ఏకైక రక్షకుడు ఆ బాలుడు క్రీస్తు బాలుడు సర్వ మానవాళి పాపపరిహారకుడు ||ఇమ్మానుయేలు||

1వ చరణం

పరము నుండి దూతలు దిగి వచ్చిరి పాటలు పాడి ఆరాధించిరి (2) గొల్లలేమో పరుగున వచ్చిరి క్రీస్తును చూసి సాగిలపడిరి(2) ||ఆ బాలుడు||

2వ చరణం

పాపుల పాలిట రక్షకుడు రోగుల పాలిట ఘన వైద్యుడు(2) నిన్ను నన్ను రక్షింపాను భూలోకమున ఉదయించెను (2) ||ఆ బాలుడు||

3వ చరణం

మహా మహిమలోకమునకు మహిమ వారసుడుగా నిన్ను నన్ను చేర్చవచ్చును(2) రాజాధి రాజుగా లోకధికారిగా త్వరగా మేఘాలపై రానైయుండే (2) రండి రండి రారండి పండుగ చేయను చేరండి రండి రండి రారండి సందడి చేయగా చేరండి ||ఇమ్మానుయేలు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.