♪♫
TG-4754
Telugu
ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ
Edabaayani Nee Krupa Nanu Viduvadu Ennatikee
0
views
పల్లవి
ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ (2) యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని||
1వ చరణం
శోకపు లోయలలో - కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో - నిరాశ నిసృహలో (2) అర్ధమేకాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగ (2) కృపా కనికరముగల దేవా నా కష్టాల కడలిని దాటించితివి (2) ||ఎడబాయని||
2వ చరణం
విశ్వాస పోరాటంలో - ఎదురాయె శోధనలు లోకాశల అలజడిలో - సడలితి విశ్వాసములో (2) దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2) దీర్ఘశాంతముగల దేవా నా చేయి విడువక నడిపించితివి (2) ||ఎడబాయని||
3వ చరణం
నీ సేవలో ఎదురైన - ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని - నిరాశ చెందితిని (2) భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగ (2) ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి (2) ||ఎడబాయని||