TG-3324
Telugu

ఈ స్తుతి నీకే

Ee Sthuthi Neeke

0
views
పల్లవి

ఈ స్తుతి నీకే మా యేసు దేవా (మా) మనసారా నిన్నే సేవింతుము – (2) పరలోక దూతాలి స్తోత్రాలతోనే` మా స్తోత్ర గానాలు గైకొనుమా (2) ||ఈ స్తుతి||

1వ చరణం

జగతికి పునాది నీవని మాలోన ఊపిరి నీదేనని (2) మా పోషకుడవు నీవేనని మా కాపరివి నీవేనని (2) మా హృదయాలలో ఉండాలని నీ సాక్షిగా మేము బ్రతకాలని ||ఈ స్తుతి||

2వ చరణం

మనసారా నీ దరి చేరగా మాకెంతో సంతోషమాయెగా (2) హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా (2) నీ మధుర ప్రేమను చాటాలని నీ జీవ బాటలో నడవాలని ||ఈ స్తుతి||