TG-4453
Telugu

యేసయ్య నీ ప్రేమ

Yesayya Nee Prema

0
views
పల్లవి

యేసయ్య నీ ప్రేమ నా సొంతము – నాలోన పలికిన స్తుతిగీతము యేసయ్య నీవేగా తొలికిరణము – నాలోన వెలిగిన రవికిరణము ఏనాడు ఆరని నా దీపము – నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము – నాలోన నిత్యము ఒక సంబరం ||యేసయ్య||

1వ చరణం

ఏపాటి నన్ను ప్రేమించినావు – నీ ప్రేమలోనే నను దాచినావు నా భారమంతా నువు మోసినావు – నన్నెంతగానో హెచ్చించినావు నీ కృపలోనే నను కాచినావు – నీ కనికరమే చూపించినావు నా హృదిలోనే నీ వాక్యధ్యానం – నా మదిలోనే నీ నామస్మరణం నిన్నే ఆరాధించి – నీ దయలో నే జీవించి నిన్నే నే పూజించి – నీలో నే తరియించీ ||యేసయ్య||

2వ చరణం

ఏనాడు నన్ను విడనాడలేదు – నీ నీడలోనే నడిపించినావు లోకాలనేలే రారాజు నీవే – నా జీవనావకు రహదారి నీవే నా గురి నీవే నా యేసుదేవా – చేరితి నిన్నే నా ప్రాణనాథా పర్వత శిఖరం నీ మహిమ ద్వారం – ఉన్నతమైనది నీ దివ్య చరితం సాటే లేరు నీకు – సర్వాధికారివి నీవు మారని దైవం నీవు – మహిమోన్నతుడవు నీవు ||యేసయ్య||