♪♫
TG-4454
Telugu
యేసయ్య పాదాలు
Yesayya Paadaalu
0
views
పల్లవి
యేసయ్య పాదాలు బంగారు పాదాలు (2) ఎండల్లో కందాయయ్యా అయ్యయ్యయ్యో రాళ్ళల్లో చిట్లాయయ్యా (2) ||యేసయ్య||
1వ చరణం
మండేటి ఎండల్లో కాడి మోసాడయ్యా (2) నడలేక తూలాడయ్యా అయ్యయ్యయ్యో నేల కూలాడయ్యా (2) ||యేసయ్య||
2వ చరణం
కొయ్యపై కాళ్ళు పెట్టి సీలను కొట్టిరయ్యా (2) పాదాలు అదిరాయయ్యా అయ్యయ్యయ్యో పాదాలు చితికాయయ్యా (2) ||యేసయ్య||
3వ చరణం
ఈ ప్రేమమూర్తి పాదాలు నమ్ముకుంటే (2) పాపాలు పోతాయయ్యా అయ్యయ్యా నీ శాపాలు తీరుతాయయ్యా పాపాలు పోతాయయ్యా అయ్యయ్యా నీ రోగాలు పోతాయయ్యా ||యేసయ్య||
4వ చరణం
రాతి గుండెలను మాంసపు గుండెలుగా మార్చేందుకు వచ్చాడయ్యా ప్రాణము పెట్టాడయ్యా Endallo Kandaayayyaa Ayyayyayyo Rallallo Chitlaayayyaa (2) ||Yesayya||