ఏం చేసానయ్యా నీకోసం ఈ

eem cheesaanayyaa neekoosam ee

🎵 TG-2242🌐 Telugu
పల్లవి

ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని (2) ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ||ఏం చేసానయ్యా||

1వ చరణం

ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా నిన్నే ఎదిరించానా ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా (2) ||ఏం చేసానయ్యా||

2వ చరణం

ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా నా కడుపు నింపుకున్నానా (2) ||ఇప్పటికైనా ||

3వ చరణం

ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా సోమరినైపోయానా

Report Error