♪♫
TG-3350
Telugu
ఎందుకో దేవా ఇంతటి ప్రేమా
Enduko Devaa Inthati Premaa
0
views
పల్లవి
ఎందుకో దేవా ఇంతటి ప్రేమా ఎన్నిక లేని నరుని మీద (2) మమతకు ప్రేమకు అర్హత లేని (2) మంటిపై ఎందుకు ఇంత ప్రేమ ||ఎందుకో||
1వ చరణం
ఎందుకు పనికిరాని నన్ను ఎన్నుకొంటివి ఎందుకయ్యా (2) ఎంచితివి నీ పుత్రికగా నన్ పెంచితివి నీ కృపతో నన్ను ||ఎందుకో||
2వ చరణం
సర్వ పాపముల పరిహారి సర్వ జనులకు ఉపకారి (2) శాపము నొందిన దోషి మీద శాశ్వత ప్రేమను చూపితివా ||ఎందుకో||
3వ చరణం
నాశ మార్గములో బ్రతికిన నన్ను నీతి మార్గముకు పిలిచితివా (2) నిత్యము నీతో యుండుటకు పాపిని నన్ను పిలచితివా ||ఎందుకో||