TG-5531
Telugu

బేత్లెహేము పురము నందు కన్య మరియ గర్భాన

Beethleheemu Puramu Nandu Kanya Mariya Garbhaana

16
views
పల్లవి

బేత్లెహేము పురము నందు కన్య మరియ గర్భాన పుట్టెను రక్షకుడు యేసు పశువులపాక లోన దేవునునిగా జన్మించెను రారాజు దేవుడే మానవుడై పుట్టెను ఆ నాడు లోకమంతా సంబరాలతో నిండెను చూడు ఉల్లసింతుము - ఆరాధింతుము లోకాలనేలే రారాజును ప్రకటింతుము - లోకమంతయు పాపము బాపే మన యేసుని క్రీస్తు పుట్టెను - తార వెలిసెను - చీకటి అంతయు వెలుగాయెను ఆనందము - పరమానందము కలిగించు వార్త - దూత తెలిపెను దివి నుండి భువికి ఏతెంచెను యూదుల రాజుగా జన్మించెను ఈ జగతిని ఏలే రక్షకుడే మన కోసం అరుదించెను ||ఉల్లసింతుము||

1వ చరణం

నడిచివెళ్లిరి - జ్ఞానులందరు - తూర్పు దిక్కు చుక్క చూపే దారిలో ఆరాధించిరి - బోళముతో - మనకై జన్మించిన ఆ శిశువును అదిగో మన రక్షకుడు యేసు పుట్టెను లోకమంతా సంతోషించెను దేవాది దేవుడే దిగి వచ్చెను పుడమే పులకించేను ||ఉల్లసింతుము||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.