TG-5534
Telugu

బేత్లెహేములో రారాజు పుట్టెను లోకమంతా సందడే ఆయెను

Beethleheemuloo Raaraaju Puttenu Lookamanthaa Sandadee Aayenu

16
views
పల్లవి

బేత్లెహేములో రారాజు పుట్టెను లోకమంతా సందడే ఆయెను (2) ఊరు వాడా సంబరాలు చేసెను పల్లె పల్లె కాంతులతో మెరిసెను  (2) వేడుక చేద్దాం - గంతులు వేద్దాం పండగ చేద్దాం - ఇక సందడి చేద్దాం - రండి తూర్పున తార వెలిసెను నేడు జ్ఞానులందరికి వార్త తెలిపెను చూడు (2) నీతిమంతుడు అవతరించెనంటగా పాప శాపమే అంతమాయెనంటగా (2) వేడుక చేద్దాం - గంతులు వేద్దాం పండగ చేద్దాం - ఇక సందడి చేద్దాం - రండి చీకటి తెరలు ఇక తొలగెను నేడు లోకమంతటికి వెలుగు కలిగెను చూడు (2) అంధకారమే తొలగిపోయెనంటగా చీకు చింతలే తీరిపోయెనంటగా (2) వేడుక చేద్దాం - గంతులు వేద్దాం పండగ చేద్దాం - ఇక సందడి చేద్దాం - రండి హ్యాపీ క్రిస్మస్ - మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ - మేరీ క్రిస్మస్

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.