TG-5533
Telugu

బేత్లెహేములో ఆ ఊరిలో సందడి

Beethleheemuloo Aa Ooriloo Sandadi

0
views
పల్లవి

బేత్లెహేములో ఆ ఊరిలో - సందడి యేసు పుట్టిన ఆ పాకలో - సందడి మరియ పుత్రుడు ఈ ధరణిలో - సందడి దేవుని వరము కరుణించెను - సందడి యూదుల రాజు నేడు పుట్టెను - సందడి ప్రజలందరికీ వెలుగు కలిగెను - సందడి (2) ఆడుదాము పాడుదాము ఓరన్నా లోక రక్షకుడు పుట్టెను చూడన్నా (2) అర్ధ రాతిరి ఆ పాలములో - సందడి దూత వచ్చినా ఆ గడియలో - సందడి దూత వార్తతో అ గొల్లలు - సందడి యేసును చూడ బయలెల్లిరి - సందడి దావీదు పురములోన రక్షకుడు - సందడి రేడు జన్మించినాడు దీనుడై - సందడి ||ఆడుదాము||

1వ చరణం

తూర్పు దిక్కున ఆ నింగిలో - సందడి చుక్క పుట్టెను బహు వింతగా - సందడి జ్ఞానులందరూ ఆ చుక్కతో - సందడి బేత్లెహేముకు విచ్చేసిరి - సందడి బంగారము సాంబ్రాణి బోలము - సందడి ఆయనకు మ్రొక్కి సమర్పించిరి - సందడి ||ఆడుదాము||

2వ చరణం

ఊరి ఊరికి మా ఊరికి - సందడి వాడ వాడకు మా వాడకు - సందడి ఇంటి ఇంటికి మా ఇంటికి - సందడి పరమ పుత్రుడు దిగి వచ్చెను - సందడి దివ్య దూతలు పాటలు పాడిరి - సందడి దేవ దేవుని ఆరాధించుడి - సందడి ||ఆడుదాము||