భూమికి నడి బొడ్డున పుట్టాడు విశ్వమంత పాలించే రారాజు
Bhoomiki Nadi Bodduna Puttaadu Vishvamantha Paalinchee Raaraaju
భూమికి నడి బొడ్డున పుట్టాడు విశ్వమంత పాలించే రారాజు ఘన పర వైభవమునే విడిచాడు మన పాప తిమిరము ను తరిమాడు రండి రండి క్రీస్తు ను దర్శిద్ధాం తూర్పు దేశ జ్ఙానుల వలె పూజిద్దాం రండి రండి క్రీస్తు ను స్తుతియిద్దాం గొఱ్ఱెల కాపరుల వలె ప్రకటిద్దాం గగనమంత తనకు సింహాసనము పుడమి అంత తనకు పాద పీఠము పాదరక్షకైన పనికి రాని పాపికై పుట్టెను శుద్ది చేయ పాప రహితుడై సృష్టి కి తన మాటయే శాసనము తన మాటకు తొలగెను ప్రతి రోగము మాట వినక మరణమైన దుష్ట నరునికై పుట్టెను పరమ జీవమునిచ్చుటకై ప్రళయ జలముపై ఆయన సింహాసనము బహు భీకరము ఆ యేసుని రాజసము పశుప్రాయుడై చెడిన ప్రతీ మనిషికై పుట్టెను పశుశాలలో బలి అవ్వడానికై
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.