ఎంతెంత భారమాయె ఆ సిలువ

enthentha bhaaramaaye aa siluva

🎵 TG-1691🌐 Telugu
పల్లవి

ఎంతెంత భారమాయె ఆ సిలువ లోక పాపములన్ని నువ్వు గెలువ (2) కదిలినావు ఆ కల్వరికి మరణముని దరి చేర్చుకొని యేసయ్యా… నా యేసయ్యా… అలసిపోతివ నా యేసయ్యా… కొరడాలు నీ ఒళ్ళు చీల్చేను పిడి గుద్దులతో కళ్ళు తిరిగెను వడి ముళ్ళు తలలోన నాటేను నీ కళ్ళు రుధిరాన్ని కురిసెను (2)           ||యేసయ్యా||

1వ చరణం

బరువైన సిలువను మోయలేక తడబడె నీ అడుగు అదిరిపడి వడివడిగా నిన్ను నడువుమని పడి పడి తన్నిరి ఆ పాపులు (2)      ||యేసయ్యా||

2వ చరణం

చల్లని నీ దేహమల్లాడెను ఏ చోటు లేకుండ గాయాలతో కాళ్ళు చేతులకు దిగి మేకులు వ్రేళాడే సిలువకు నీ ప్రాణము (2)        ||యేసయ్యా||

3వ చరణం

వెలలేనిది తండ్రి నీ త్యాగము నీ కష్టమంతయు నా పాపము మదిలోన కొలువుండు నా రక్షకా వదిలేది లేదు నిన్ను నా పాలిక (2)            ||యేసయ్యా||

Report Error