రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా
Raathri Needu Rakshakundu Velise Vinthagaa
రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా నేడెంతో మోదమొందగా – ఈ పాపి రక్షణార్ధమై (2) లోక పాపమెల్ల తనదు శిరస్సు మోసెను లోక నాథుడై మరియకవతరించెను (2) ఇతండె దేవుడాయెను (6) ||రాత్రి||
బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామము యేసు రాజుకేసిపెట్టె పశుల కొట్టము (2) ఈ నాడే మనకు పండగ రారండి ఆడి పాడగ (3) ||రాత్రి||
ఆకశాన తార ఒకటి బయలుదేరెను తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను (2) చిన్నారి యేసు బాబును కళ్లారా చూసి మురిసెను (3) ||రాత్రి||
పొలములోని గొల్లవారి కనుల ముందర గాబ్రియేలు దూత తెలిపె వార్త ముందుగా (2) మేరమ్మ జోల పాడగా జగాలు పరవశించెగా (3) ||రాత్రి||
లోకములో క్రీస్తు ప్రభుని తాకి మ్రొక్కెను భూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను (2) ఇతండె దేవుడాయెను (6) ||రాత్రి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.