రాతి కుండను నేను ఖాళియై యున్నాను
Raathi Kundanu Neenu Khaalliyai Yunnaanu
రాతి కుండను నేను - ఖాళియై యున్నాను నింపుమా.. అంచులవరకూ (2) నీకింపుగా.. మార్చబాడుటకు (2) 1. వెఱ్ఱి ద్రాక్షలు.. లోనికి చేరెను - అంతరంగము చేదుగా మారెను. మాధుర్యం పంచుటకు.. తగిన పాత్రగా (2) శుభ్రము చేయుమా - నను శుభ్రము చేయుమా నింపుమా.. అంచులవరకూ (2) నీకింపుగా.. మార్చబడుటకు (2) 2. జీవ డంభము మిగిలి యుండెను - లోకస్నేహము చెరుపుచుండెను మాలిన్యం ఏమాత్రం అంటకుండగా (2) భద్రము చేయుమా - నను భద్రము చేయుమా నింపుమా.. అంచులవరకూ (2) నీకింపుగా.. మార్చబడుటకు (2) 3. తప్పుబోధకు కలతచెందక - చెడ్డమాటతో శ్రమను పొందక నీకోసం నమ్మికతో - ఎదురుచూడగా (2) సిద్ధము చేయుమా - నను సిద్ధము చేయుమా నింపుమా.. అంచులవరకూ ( 2) నీకింపుగా.. మార్చబడుటకు (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.