రాత్రింబవళ్లు పాడెదను యేసు నామం క్రీస్తు నామం
Raathrinbavalllu Paadedanu Yeesu Naaman Kreesthu Naaman
రాత్రింబవళ్లు పాడెదను యేసు నామం - క్రీస్తు నామం 1. పురుగు వంటి నరుడ నాకు - ప్రభువు రాజ్య మియ్యదలచి పరమునుండి ధరకేతెంచి - ప్రాణమున్ బలిగా నిచ్చె 2. ఎన్నిక లేని చిన్నమంద - భయపడకు నీవిలన్ ఘనమైన పరమతండ్రి - రాజ్యమివ్వ నిష్టపడెన్ 3. పాప కూపమునందు నేను - పడి చెడి యుండగా గొప్ప రక్షణ నిచ్చి పరమ - రాజ్యమందు చేర్చెను 4. నీతి హేనుడనైన నాకు - నీతి రాజ్యమివ్వదలచి నీతి రక్షణ వస్త్రములను - ప్రీతి తోడ తొడిగెను 5. పేరుపెట్టి పిలచినన్ను - పరమ రాజ్యమును తండ్రి వారసునిగా నన్ను జేసి - వైరినిల సిగ్గుపరచెన్ 6. పరమందు దూతలు - వింత పొందునట్లుగా ఏర్పరచుకొంటివి నరుని - నరుడు ఏపాటి వాడు? 7. దానియేలు షద్రక్ మేషాక్ - అబెద్నెగో యనువారలన్ చిన్నమందగా జేసి - రాజ్యమేల జేసెన్ 8. ఎన్ని శ్రమలు వచ్చినను - సన్నుతింతు నా ప్రభున్ ఘనత మహిమ కర్హుడని - హల్లెలూయ పాడెదన్