ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ

evaru choopinchaleenee - ilaloo nanu veedipoonee

🎵 TG-2941🎤 Joshua Shaik Ministries🌐 Telugu
పల్లవి

ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ మరువనూ యేసయ్య నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా

1వ చరణం

తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా

2వ చరణం

ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య

Report Error