చిక్కుల్లో నేను పడినా యేసయ్య
chikkulloo neenu padinaa yeesayya
చిక్కుల్లో నేను పడినా యేసయ్య ఆదుకొని ఆదరించవా యేసయ్య అందరిలో నన్ను చేర్చవా (2)
గాఢాంధ-కారములో నేనున్నాను – త్రోవ తప్పి గోతిలో పడియున్నాను (2) నీ వెలుగులో దారి చూపవా యేసయ్య – నీ మార్గములో నన్ను నడుపుమా యేసయ్య నీ మార్గములో నన్ను నడుపుమా ||చిక్కుల్లో నేను ||
ఘోర పాపినైనా నన్ను క్షమియించావు – నీ ప్రేమతో నన్ను ఆదరించావు (2) శోధనలు ఎన్ని వచ్చినా యేసయ్య – నీ కృపలో నన్ను దాయుమా యేసయ్య నీ కృపలో నన్ను దాయుమా ||చిక్కుల్లో నేను ||
ద్రాక్ష వల్లి వలె నీవున్నావు – ఫలము లేని తీగవలె నేనున్నాను (2) నీ ఆత్మతో నన్ను నింపుమా యేసయ్య – నీ బలముతో నన్ను నింపుమా యేసయ్య నీ బలముతో నన్ను నింపుమా ||చిక్కుల్లో నేను ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
