కళ్ళల్లో కన్నీరెందుకు – గుండెల్లో

kallllalloo kanneerenduku – gundelloo

🎵 TG-1453🌐 Telugu
పల్లవి

కళ్ళల్లో కన్నీరెందుకు – గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా – గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా యేసే నీ రక్షణ – యేసే నీ నిరీక్షణ (2) ||కళ్ళల్లో||

1వ చరణం

హోరు గాలులు వీచగా – తుఫానులు చెలరేగగా మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2) యేసే నీ నావికా భయము చెందకు నీవిక యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక ||కళ్ళల్లో||

2వ చరణం

కరువు ఖడ్గములొచ్చినా – నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైనా భయము చెందకుమా యేసే నీ రక్షకా – దిగులు చెందకు నీవిక యేసే విమోచకా – సంతసించుము నీవిక

Report Error